- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం ఎత్తవేత
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్తను అందించారు.రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ఫరిదిలో ఉన్న ఇంజినీరింగ్ కళశాలల్లో క్రెటిట్ స్కోరు జేఎన్‌టీయూలో 25 శాతం, ఓయూలో 50 శాతంతో విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కాగా అనేక మంది విద్యార్థులు ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ పలుమార్లు.. యూనివర్సిటీల్లో నిరసన వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉస్మానియా, జెన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో డిటెన్షన్ విధానం అమలు చేడయం లేదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అలాగే రెండు యూనివర్సిటీలలో వేర్వేరుగా క్రెడిట్ స్కోరు విధానం ఉండటంపై కాలేజీల యాజమాన్యాలతో తాము సమావేశమవుతామని.. దీనిపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. కాగా ప్రభుత్వం తాజా నిర్ణయం తో అనేక మంది విద్యార్థులకు ఉపశమనం కలిగించనుంది.