- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi Air Quality: వరుసగా రెండోరోజు ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గాలినాణ్యత(Delhi Air Quality) తీవ్రంగా పడిపోయింది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత 400కు పైగా నమోదైంది. మంగళవారం ఉదయం ఏక్యూఐ (AQI) 427గా నమోదైంది. ఇకపోతే, 35 మానిటరింగ్ స్టేషన్లలో 28 చోట్ల గాలినాణ్యత 450 దాటింది. మిగతా ఏడుచోట్ల 400 పైన ఏక్యూఐ నమోదైంది. ఇకపోతే, ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం ఏక్యూఐ (AQI) 350 మార్కును దాటింది. దీంతో, అక్కడ గ్రాప్- 3 (GRAP-3)ని అమలు చేశారు. కొన్ని గంటలకే గాలి నాణ్యత మరింతగా పడిపోయింది. దీంతో, గ్రాప్ 4ని(GRAP-4) అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్‌మెంట్ (Air Quality Index Management) వెల్లడించింది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా, కనిష్ఠ ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. మరోవైపు, వచ్చే రెండ్రోజుల పాటు ఢిల్లీలో పొగమంచు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 24 డిగ్రీల సెల్సియస్ మరియు 5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందంది.
ప్రభుత్వం చర్యలు
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. మరోవైపు, ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గ్రాప్ -4 అమలు చేస్తున్నారు.