- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
One Nation One Election bill : జమిలి బిల్లు.. త్రీలైన్ విప్ జారీ చేసిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును(One Nation One Election bill ) లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. కాగా.. బీజేపీ తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి. సభలోకి వెళ్లే ముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. జమిలి ఎన్నికకు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్(Union Law Minister Arjun Ram Meghwal) లోక్‌సభలో(Lok Sabha) ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాల్సిందిగా కేంద్రమంత్రి స్పీకర్ ఓం బిర్లాను(Lok Sabha Speaker Om Birla ) కోరే అవకాశం ఉంది.
కమిటీకి సభ్యులుగా ఎవరంటే?
ఇక, ఇందుకు వీలుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ ను, సభ్యులను లోక్ సభ స్పీకర్ స్పీకర్ ఓం బిర్లానే నియమించనున్నారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పించనున్నారు. అయితే, మెజార్టీ ఉన్న బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన తర్వాత కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అవసరమైతే దాని గడువు పొడిగిస్తారు. డిసెంబర్ 20న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అందుకే, పార్లమెంటులో జమిలి బిల్లుని మంగళవారమే ప్రవేశపెట్టబోతున్నారు. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతు ఇస్తుండగా.. మరో 15 పార్టీలు వ్యతిరేకించినట్టు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది.