BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

by Ramesh Goud |
BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) వినూత్న నిరసన(Protest) చేపట్టారు. నల్ల చొక్కాలు(Black shirts), బేడీలు ధరించి అసెంబ్లీ కి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు లగచర్ల(Lagacharla Incident) రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govrnment) వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) సహా ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కాలు, చేతులకు బేడీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు.. అంటూ పలు రకాల నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు సభలో లగచర్ల, దిలావర్ పూర్, రామన్న పేట సహా పలు ఘటనలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed