జమిలి ఎన్నికలు సంపూర్ణ మద్దతు తెలిపిన టీడీపీ.. దద్దరిల్లిన సభ

by Mahesh |
జమిలి ఎన్నికలు సంపూర్ణ మద్దతు తెలిపిన టీడీపీ.. దద్దరిల్లిన సభ
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ సమావేశాల్లో ఈ రోజు జమిలి ఎన్నికల బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే(Arjun Ram Meghwal) ప్రవేశపెట్టారు. కాగా ఇందుకోసం కేంద్రం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(Constitution Amendment Bill) సహా మరో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లుపై సభలోని వివిధ పార్టీల నిర్ణయాలను స్పీకర్(Speaker) అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ఎంపీకీ అవకాశం ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.. జమిలి ఎన్నికల బిల్లు(Jamili Election Bill)ను ముక్తకంఠంతో వ్యతిరేకించగా.. ఎన్డీయే(NDA) కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ(TDP) సంపూర్ణ మద్దతు(Full support) ప్రకటించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. టీడీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అలా ఎలా మద్దతు తెలుపుతారని కాంగ్రెస్ సహా ఇతర పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed