- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుంగభద్ర ఖాళీ అవుతున్నా గంపెడు ఇసుక ఇవ్వరా..
దిశ, అలంపూర్ : సామాన్య ధర, నాణ్యమైన సరకు, కావాల్సిన నిల్వలు, తుంగభద్ర నది తీరం ఉన్నప్పటికీని గంపెడు ఇసుక తీసుకోలేని పరిస్థితి ఈ ప్రాంతానికి ఏర్పడింది. ఇండ్ల నిర్మాణం, ఏదైనా మరమ్మతులు, కాంట్రాక్టర్లు పనులు చేయాలి అనుకున్నప్పటికిని ఈ ప్రాంత ప్రజలకు మాత్రం అనుమతులు కనిపించడం లేదు. ప్రభుత్వం నడుపుతున్న "మన ఇసుక వాహనాన్ని" జనాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఆన్లైన్లో అలంపూర్ ప్రాంతానికి మాత్రం ఇసుక తీసుకోవడానికి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఆరు నెలలుగా ఈ పరిస్థితి ఏర్పడింది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, పుల్లూరు, మద్దూర్, ధన్వాడ గ్రామాల్లో ఇసుక రీచులు ఉన్నప్పటికీని గంపెడు ఇసుక తీయలేని పరిస్థితి ఏర్పడింది. మన ఇసుక అనుమతులతో ఇసుక సరఫరా మాత్రం గద్వాల పట్టణానికి వందల వాహనాల్లో ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఇసుక అనుమతులు ఆన్లైన్ నుండి లభించాయని అధికారులు చెబుతున్నారు. రోజువారీగా గత నెల రోజులుగా మనోపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామం తుంగభద్ర తీరం నుండి వందల ట్రాక్టర్లతో మానోపాడు మండల కేంద్రం గుండా గద్వాలకు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు.
ఇక్కడికి ప్రాంత ప్రజలకు మాత్రం ఇసుక అనుమతి లేకపోవడం ఏమిటని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక అనుమతులు లేకపోవడంతో చాలా మంది ఇండ్ల నిర్మాణం ఆగిపోయింది. కొన్నిచోట్ల ప్రైవేటు పనులు కూడా నిలిచిపోయాయి. ప్రైవేటు వ్యక్తులు, దళారులను ఆశ్రయించి దొంగతనంగా ఇసుకను తరలించుకోవాలి అనుకున్న ఒకవైపు నాసిరకం ఇసుక, మరోవైపు డబ్బుల మోతతో భారీగా నష్టం వాటిల్లుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మన ఇసుక ఆన్లైన్ సేవలను పునరుద్ధరించి అలంపూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు ఇసుకను తీసుకొనుటకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇసుక అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వానికి కూడా లాభం చేకూరి అవకాశం ఉందన్నారు. తుంగభద్ర తీరం ఉన్న గ్రామాలకు మాత్రం ఇసుక మూతులు ఇవ్వకుండా గద్వాల ప్రాంతానికి మాత్రం ఎలా ఇసుక అనుమతులు ఇచ్చారని కూడా కొందరు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం మన ఇసుకల్లో అనుమతులు వస్తే తప్ప ఇసుకను బయటకు తరలించడానికి ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. కావున అధికారులు అలంపూర్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మన ఇసుకలో అనుమతులు ఇస్తే ఆన్లైన్ చేసుకుని తీసుకుని బుక్ చేసుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.