- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sooseki Song:‘పుష్ప-2’ లోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన నవ దంపతులు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Tollywood famous director Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప-2’ (Pushpa 2) బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. డిసెంబరు 5 వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం పదకొండు రోజుల్లోనే ఏకంగా 1400 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Tollywood Star Hero Iconstar Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారనడంలో అతిశయోక్తిలేదు. పుష్ప-2 లోని సాంగ్స్ కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో రష్మిక-బన్నీ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ (Suseki aggiravva madiri uṇṭaḍe na sami) అనే సాంగ్‌కు వేసిన పాట పుష్ప-2 కు మరింత హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సాంగ్‌కు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికన పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఈ పాటకు కొత్తగా పెళ్లైన ఓ జంట ఖతర్నాక్ స్టెప్పులేసింది. సేమ్ పుష్పరాజ్(Pushparaj) అండ్ శ్రీవల్లీ(Srivalli) లాగే డ్యాన్స్ చేసి.. నవ దంపతులు ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.