Yadadri Bhuvanagiri : సంక్షేమ హాస్టల్ లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

by M.Rajitha |
Yadadri Bhuvanagiri : సంక్షేమ హాస్టల్ లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : భువనగిరి(Bhuvanagiri) పట్టణంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్(Social Welfare Residential Hostel)​ను కలెక్టర్(Collector) హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ(Inspections) చేశారు. అయితే సోమవారమే హాస్టల్​ను సందర్శించిన కలెక్టర్ వంటగదిలో ఆహారపదార్థాలు, కూరగాయలు తనిఖీ చేశారు. శుచి, శుభ్రత, ఉండేలా నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందివ్వాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించారు. ఇవాళ మరోసారి అదే హాస్టల్ లో తనిఖీకి వచ్చిన కలెక్టర్.. మెస్ వాతావరణం అపరిశుభ్రంగా ఉండటం, భోజనంలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ రమేష్​ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్​కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించక పోవడం, విద్యార్థులకి పెట్టే గుడ్లు సరిగా లేకపోవడం, విద్యార్థుల చేత పనిచేయించడం, పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం, డైనింగ్ హాల్​లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్.. నిర్వాహకుల అలసత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

Advertisement

Next Story