- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డంపింగ్ యార్డుతో పరేషాన్
by Kalyani |

X
దిశ, దుండిగల్ : దుండిగల్ మున్సిపాలిటీ,దుండిగల్ తండా-2లోని డంపింగ్ యార్డులో నిత్యం వెలువడుతున్న పొగ కాలుష్యం తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డు ఉండడం, మున్సిపాలిటీ కి సంబంధించిన చెత్తను సింహభాగం అక్కడికే తరలించడం, చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని తండావాసులు సోమవారం డంపింగ్ యార్డు వద్ద నిరసన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని, శ్వాస కోశ వ్యాధులు ప్రబలుతున్నాయని, నిర్వహణను గాలికి వదిలేయడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నామన్నారు. వర్షం పడిన ప్రతిసారి పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ నాయక్, రాజు నాయక్ తండా వాసులు పాల్గొన్నారు.
Next Story