- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిడ్జిల్ లో ఆరుగురు మిస్సింగ్.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఘటన

దిశ, మిడ్జిల్ : మండలంలోని రెండు కుటుంబాల్లో ఆరుగురు మిస్సయిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్టు మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. మండల పరిధిలోని బోయినపల్లి గ్రామానికి ఓర్సు శ్రీను (39 )కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవ పడి తన ఆరు సంవత్సరాల కుమారుడు శశాంక్ ను ఈనెల 12వ తేదీన స్కూల్ తీసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపారు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని, చుట్టుపక్కల గ్రామాలతో పాటు బంధువుల వద్ద వెతికినా.. ఆచూకీ లభించలేదన్నారు. దీంతో భార్య జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కాగా మరో ఘటనలో మండలంలోని చిలువేర్ గ్రామానికి చెందిన మల్లెపల్లి అలివేల ఇంట్లో తన భర్తతో గొడవ పడింది. దీంతో తన ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడిని తీసుకొని ఈనెల నాలుగో తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. అయితే ఆరోజు నుంచి నేటి వరకు ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అలివేల కోసం చుట్టుపక్కల గ్రామాలతో పాటు.. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మల్లేపల్లి హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా మండలంలో ఒకేసారి ఆరుగురు మిస్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.