TG Assembly: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై స్పీకర్‌కు కంప్లైంట్ చేసిన BRS ఎమ్మెల్యేలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-17 11:21:08.0  )
TG Assembly: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై స్పీకర్‌కు కంప్లైంట్ చేసిన BRS ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వెయ్యి కోట్లు సంపాదించారంటూ నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్ 319 (ii & iii): సభ్యుడు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేస్తుందని గుర్తుచేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే లేదా ప్రతికూల ప్రభావం చూపించే చర్యలకు ఇది విరుద్ధమని అన్నారు. రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. రికార్డులు పరిశీలించి తొలగిస్తానని స్పీకర్(Speaker) హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed