- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Look Out Notice: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani)కి ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన కుటుంబంపై తాజాగా పోలీసులు దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు (Look Out Notices) జారీ చేశారు. ఈ కేసులో పేర్ని నాని దంపతులు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19కు వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో భాగంగా ఈనెల 13న రూ.కోటి విలువైన మూడు డీడీలు సమర్పించింది. సోమవారం మరో రూ.70 లక్షల డీడీలు అధికారులకు అందజేశారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ.1.7 కోట్ల డీడీలు అధికారుల హ్యాండోవర్ చేశారు. అయితే, అసలు గోదాంలో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై అధికారులు మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పేర్ని నాని (Perni Nani) కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు (Look Out Notices) జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించకుంది.