- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : కలెక్టర్
దిశ, చిట్యాల: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మండలంలోని జడల్ పేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏకరూప మెనూ, ఏకరూప భోజనం పట్టికను రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో, విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టగా… మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ (గర్ల్స్) స్కూల్ ను మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని కిచెన్, డైనింగ్ హాల్, వాష్ ఏరియాను, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థిలతో నూతన డైట్ ను, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. హాస్టల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారా, రక్తహీనతతో బాధపడే పిల్లలు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఇటీవలే ఎమ్మెల్యే సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నూతన డైట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో, ఏసిఎల్వి విజయలక్ష్మి ,ఆర్డీవో మంగ్లీలాల్ ,ఎంపీడీవో జయశ్రీ ,ఎమ్మార్వో హేమ ,ఎం పి ఓ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి, విద్యార్థినిలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.