- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS MLC'S : శానస మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రచ్చ..!

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం(State Government)లగచర్ల రైతుల(Lagacharla farmers)పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం ముందు ఫ్లకార్డ్సు ధరించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చినా రైతుకు బేడీలా? ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అంటూ నినాదాలలో మండలి సమావేశాలను అడ్డుకున్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనను అధికార పక్ష సభ్యులు తప్పుబట్టారు.
చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులను తమతమ స్థానాల్లో వెళ్లి కూర్చోవాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోకుండా నిరసన కొనసాగించారు. రైతుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనపై శాసన మండలిలో చర్చకు అనుమతించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కానీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యుల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఆవరణలో లగచర్ల రైతులకు సంఘీభావంగా తమ నిరసనను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.