Alla Nani : టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని!

by Y. Venkata Narasimha Reddy |
Alla Nani : టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని!
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(Alla Nani) టీడీపీ(TDP)లో చేరబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరుతారు. ఆళ్ల నాని చేరికపై ఏలూరులో అసంతృప్తిగా ఉన్న తెలుగు తమ్ముళ్లను టీడీపీ అధిష్టానం బుజ్జగించింది. ముఖ్యంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారు.

గతంలో ఒకసారి ఆళ్ల నాని టీడీపీలో చేరిక వాయిదా పడటంతో ఈ దఫా అలాంటి ఆటంకాలు లేకుండా చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని చేరికకు లైన్ క్లియర్ చేశారు. రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని... ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed