Praja Bhavan: దళిత బంధు నిధులు విడుదల చేయాల్సిందే.. ప్రజా భవన్ ఆందోళన

by Ramesh N |
Praja Bhavan: దళిత బంధు నిధులు విడుదల చేయాల్సిందే.. ప్రజా భవన్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండో విడత దళిత బంధు (Dalit Bandhu) పథకం ద్వారా ఎంపిక అయిన లబ్ధిదారుల అకౌంట్లో నిధులను జమ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. మంగళవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే ప్రజా భవన్ (Praja Bhavan) వద్ద సాధన సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన వారికి నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని సమితి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed