MLA Vivekananda: ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధం.. ఎమ్మెల్యే వివేకానంద ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
MLA Vivekananda: ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధం.. ఎమ్మెల్యే వివేకానంద ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ప్రభుత్వం దాడికి దిగుతోందని కత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) ఆరోపించారు. ఇవాళ ఆసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కుట్ర రాజకీయాలు చేసేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారే తప్పా.. ప్రజా సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదని అన్నారు. గడిచిన ఏడాది పాలనలో అన్ని ఘటనల్లోనూ కేటీఆర్‌ (KTR)ను ఇరికించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. లగచర్ల (Lagacharla) రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి వారిని జైలుకు పంపారని ఆరోపించారు. అందులో ఓ రైతుకు బేడీలు వేసి ఆసుపత్రి తీసుకెళ్లిన ఘటన రాష్ట్ర ప్రజలంతా చూశారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాని (Congress Government)కి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. సీఎం, మంత్రులు కూడి ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధమని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed