అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహిత సంఘంలో చీలికలు

by Mahesh |
అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహిత సంఘంలో చీలికలు
X

దిశ, అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వ్రత పురోహిత సంఘంలో చీలికలు మొదలయ్యాయి. ఇప్పటికే సంఘం కార్యదర్శి తో పాటు కొందరు కీలక సభ్యులు రాజీనామా చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా సభ్యులు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేవస్థానంలో అన్ని విభాగాల కంటే అత్యంత కీలకంగా పనిచేసే వ్రత పురోహిత విభాగంలో చీలికలు మొదలు కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుమారు 240 మందికి పైగా ఉన్న పురోహితులు దశాబ్ద కాలం కిందట సంఘాన్ని ఏర్పరచుకొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించేవారు.

నూతన కార్యవర్గంతోనే సమస్యలు

గతేడాది వ్రత పురోహిత సంఘం లోని కొందరు స్వార్థపరుల కారణంగా సంఘానికి ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్యవర్గం ఏర్పడిన నాటి నుంచి సంఘంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నతాధికారులు ధర్మకర్తల పట్ల వ్యతిరేక ధోరణిలో వ్యవహరించడం వంటి అంశాలపై సంఘంలో చీలికలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొందరు కీలక సభ్యులు రాజీనామాలు చేయగా మిగిలిన మెజారిటీ సభ్యులు కూడా రాజీనామా చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed