IND Vs AUS: కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం.. టీమిండియాకు ఫాలో‌ఆన్ గండం!

by Shiva |
IND Vs AUS: కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం.. టీమిండియాకు ఫాలో‌ఆన్ గండం!
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదిక‌గా ఆస్ట్రేలియా (Australia)తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (Team India) ఎదురీదుతోంది. నాలుగో రోజు లంచ్ బ్రేక్‌కు భారత (India) జట్టు 6 కీలక వికెట్లను కోల్పోయి 167 ప‌రుగులు మాత్రమే చేసింది. ఆసిస్ బౌలర్ల ధాటికి క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోర్ కూడా చేయకుండానే పెవీలియన్‌కు క్యూ కట్టారు. కేఎల్ రాహుల్ (KL Rahul) మరోవైపు రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లు మాత్రమే సంయమనంతో ఆడుతూ.. స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.

భారత్ ఫాలోఆన్ (Follow On) గండం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే మ‌రో 79 ప‌రుగులు చేయాల్సి ఉంది. అయితే, స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 84 ప‌రుగులు చేసి తృటిలో సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 77 బంతుల్లో 41 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) 20 బంతుల్లో 7 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 2, ప్యాట్ కమిన్స్ (Pat Cummins) 2, జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood), నాథన్ లయన్ (Nathan Lion) చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా ప్రస్తుతం ఆటను అంపైర్లు నిలిపి‌వేశారు.



Next Story

Most Viewed