- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ibrahimpatnam: పంచాయితీ భవన నిర్మాణంలో రెండేళ్లకే పగుళ్లు
దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించిన రెండు సంవత్సరాలలోపే పగుళ్లు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా గ్రామ పంచాయతీ నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో నిర్మించిన కొన్నాళ్లకే పగుళ్లు కనిపిస్తున్నాయి. రాయపోల్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి ఎమ్జీఆర్ఈజీఎస్, డీఎంఎఫ్, జడ్పీజీఎఫ్ నిధుల నుంచి రూ.50 లక్షలు వెచ్చించి నిర్మించారు. ఈ భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. భవనం నిర్మించి రెండు సంవత్సరాలు గడవకముందే పగుళ్లు దర్శనమిస్తున్నాయి. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో కాంట్రాక్టర్ తన స్వ లాభం కోసం ఇష్టానుసారంగా పనులు చేసి చేతులు దులుపుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభు త్వం అభివృద్ధి పనుల నిర్మాణం కోసం కోట్లాది రూపా యలు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ అసలే లేకపోవడంతో పనులు నాసిరకంగా నాణ్య త లేకుండా జరుగుతున్నాయన్న గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి నాసిరకంగా పనులు జరుగుతున్న నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నాణ్యతాలోపంతోనే పగుళ్లు..
గ్రామ పంచాయతీ భవనం నాణ్యత లేకుండా నాసిరకంగా భవన నిర్మాణం చేపట్టడంతో పగుళ్లు దర్శనమిస్తున్నాయి. భవన నిర్మాణం జరిగే దశలో సిమెంట్ కు బదులు ఎక్కువగా డస్ట్ వాడడం, వాటర్ క్యూరింగ్ లేకపోవడం, హడావిడిగా పనులు పూర్తి కాకముందే భవనానికి పెయింటింగ్ వేసి ప్రారంభం చేశారు. దీని కారణంగా పగుళ్లు ఏర్పడాయని గ్రామస్థుడు బాలం పవన్ కుమార్ అంటున్నారు.