- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేన్స్ సంస్థతో 2000 మందికి ఉపాధి
దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 1988లో ఈ కంపెనీ ఏర్పడి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందుబాటులో తెస్తుందని, 2800 కోట్లతో కంపెనీని స్థాపించి రాబోయే కాలంలో 2000 మందికి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. ఈ పరిశ్రమ నుండి త్వరగా ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఇక్కడి యువతకు ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయుటకు పనులు ప్రారంభించిందని, దీంతో 4వ పట్టణంగా ఇక్కడి ప్రాంతం అభివృద్ది చెందుతుందని, త్వరలో హైదరాబాద్కు మరొక తలమనికంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కంపెనీలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం కేన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇక్కడి నుండి వెళ్లిపోతుందని విష ప్రచారం చేసిందన్నారు.
నేడు ఈ ప్లాంట్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, కేన్స్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ సబిత రమేష్, ఎండీ రమేష్ కణ్ణన్, సీఈఓ రఘు పాణికర్, రాష్ట్ర మౌలిక, పారిశ్రామిక కల్పన సంస్థ వైస్ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ఇతర ప్రముఖ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు, ముఖ్య భాగస్వాములు పాల్గొన్నారు.