తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణరావు?

by Nagaya |   ( Updated:2023-01-10 13:35:06.0  )
తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణరావు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నూతన సీఎస్ గా రామకృష్ణ రావు పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. కొత్త సీఎస్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం రేపు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామకృష్ణరావు ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణరావుతో పాటు సీఎస్ రేసులో మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందే అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సీఎస్ వేటలో ఉన్నట్టు తెలుస్తోంది.

Read more:

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ కేడర్ నుండి సోమేష్ కుమార్ ఔట్

Advertisement

Next Story

Most Viewed