- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుస ట్వీట్లతో హైదరాబాద్ మేయర్‌పై RGV తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆకలిని తట్టుకోలేక ఆ కుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేశాయంటూ.. అంబర్‌పేట్ ఘటనపై మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. మేయర్ వ్యాఖ్యలపై ఓవైపు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తాజాగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. గురువారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో మేయర్ విజయలక్ష్మిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేయర్ విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేసి, వీధి కుక్క గూండాలందరినీ మీ ఇంట్లోకి తీసుకెళ్లి.. మా పిల్లలను తినకుండా మీరే వాటికి ఆహారం ఎందుకు ఇవ్వకూడదు? అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, మేయర్ పోయిన జన్మలో కుక్కలా పుట్టి ఉంటారని అన్నారు. నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కలను ఒక డాగ్ హోంగా మార్చాలని అందులో వాటి మధ్యలో మేయర్‌ను ఉంచాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. కాగా, నాలుగేళ్ల ప్రదీప్ పై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై మేయర్ స్పందిస్తూ'అంబర్ పేటలో ఓ మహిళ రోజూ వీధి కుక్కలకు మాంసం అందిస్తుంది. రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదు. సోమవారం నుంచి ఆహారం లేకపోవడంతో... ఆకలిని తట్టుకోలేక ఆ కుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేశాయి'అని విజయ లక్ష్మి అన్నారు. ఈ నేపథ్యంలో మేయర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Hey @GadwalvijayaTRS why don't u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won't eat our children ? pic.twitter.com/2dfa426hRv
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023