- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజీవ్ వీర్ భూమి దగ్గర సోనియాకు జ్యోతి అందజేత
by Gantepaka Srikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తమిళనాడులో మొదలు పెట్టిన రాజీవ్ జ్యోతియాత్ర ఈనెల 20కి ఢిల్లీకి చేరుకోనున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజీవ్ గాంధీ అభిమానులు ఈనెల 8న తమిళనాడులో ఈ యాత్రను మొదలు పెట్టారు. గాంధీభవన్‌కు చేరుకున్న యాత్రకు సీనియర్ నేత హనుమంత రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావులు స్వాగతం పలికారు. నిజామాబాద్, ఆదిలాబాద్ నాగ్‌పూర్ మీదగా ఈనెల 20 వరకు ఈ యాత్ర ఢిల్లీ చేరుకోనున్నది. ఇందుకు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు యాత్రకు సహకరించనున్నారు. 20 సాయంత్రం ఢిల్లీలో రాజీవ్ వీర్ భూమి దగ్గర సోనియా గాంధీ, రాహుల్‌కు యాత్ర జ్యోతిని అందజేయనున్నారు. రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా పెరంబుదూర్ నుండి ఢిల్లీ వరకు ఈ జ్యోతి యాత్ర జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు.
Advertisement
Next Story