- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.. వారికి లక్ష రూపాయలు అందించనున్న సీఎం
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ప్రజాభవన్(Praja Bhavan)లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం(Rajiv Gandhi civil abhayahastam) కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) హాజరు కానున్నారు. అనంతరం.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంలో భాగంగా.. సివిల్స్ ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష అందించనున్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి.. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అర్ధికంగా తోడ్పడుతుంది. అయితే ఆగస్టు నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 135 మంది తెలంగాణ అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అధించింది.