సీఎం కేసీఆర్ పై Rajasingh తీవ్ర వ్యాఖ్యలు!

by Nagaya |   ( Updated:2022-12-14 09:50:44.0  )
సీఎం కేసీఆర్ పై Rajasingh తీవ్ర వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జోకర్ అని, సీఎం కేసీఆర్ బట్టేబాజ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో అభివృద్ధి విషయంలో ఎంఐఎం పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ విషయంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్స్ కూడా అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి సీఎం ఛాంబర్ వద్దకు వెళ్లి మెట్రో వద్దని చెబుతారని ఆరోపించారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే డెవలప్మెంట్ కానివ్వడం లేదని ఆరోపించారు.

ఓల్డ్ సిటీలోని ముస్లింల అభివృద్ధి కోసం నిజంగా పోరాటం చేసేంది బీజేపీయేనని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే బీజేపీకే మద్దతు ఇవ్వాలని కోరారు. ఓల్డ్ సిటికీ మెట్రో విస్తరణ కోసం నిరసన తెలియజేస్తే ముందస్తు అరెస్టులు చేశారని మండిపడ్డ రాజాసింగ్.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఇది గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కాగా మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. అయితే పాతబస్తీలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నా అక్కడ కాకుండా ఎయిర్ పోర్టుకు మెట్రో విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story