- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రన్నింగ్‌లోనే ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ కార్ టైర్
దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వాహనం మరోసారి మొరాయించింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం రాజాసింగ్ ఇంటికి వెళుతుండగా భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ టైర్ ఊడిపోయింది. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తతో వాహనాన్ని ఆపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రికి సిగ్గు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాడవుతుందని చెప్పినా తిరిగి అదే బండిని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ నుంచి ఇంటికెల్లేటప్పుడు బండి టైర్ ఊడిపోయిందని అన్నారు.
అదే సమయంలో ఒకవేళ బండి వేగంతో ఉంటే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సిగ్గు శరం ఉంటే తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని.. లేదంటే మీ బండి మీరు తీసుకోండంటూ రాజాసింగ్ విరుచుపడ్డారు. కాగా, రాజాసింగ్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనంలోనే వెళ్లాల్సిందిగా పోలీసులు రాజాసింగ్‌కు తెలిపారు. అయితే తరుచూ వాహనం చెడిపోతుండటంతో ప్రభుత్వంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇదే!