పోలీసులు ఆయన ఆదేశాలు పాటించడం ఏంటీ..? : రాజాసింగ్ సీరియస్

by Rajesh |
పోలీసులు ఆయన ఆదేశాలు పాటించడం ఏంటీ..? : రాజాసింగ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయన్నారు. ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారని తెలిపారు. దుకాణాలను బంద్ చేయించేందుకు పోలీసుల వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారిందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయన్నారు.

మర్డర్లు జరిగేది కూడా వాళ్ల మతస్తులవే కదా అన్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. అందులో అసద్‌కు ఏం బాధ అని ప్రశ్నించారు. చచ్చేది మీ వాళ్లే.. కదా అన్నారు. పోలీసులపై ఒత్తిడి ఎందుకు తెస్తున్నట్లు? అని ప్రశ్నించారు. వారి ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడన్నారు. బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలా పత్తర్, కాచిగూడ, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోందన్నారు. మేడ్చల్‌లో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారన్నారు. భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీ చేయొచ్చని ఇంకా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ఇలాంటివి జరగొద్దంటే ముఖ్యమంత్రి భయపడొద్దని సూచించారు. పోలీసులు మీ ఆదేశాలు ఫాలో చేయాలి.. కానీ అసద్ ఆదేశాలు కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed