Raj Pakala: చేవెళ్ల ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరైన రాజ్ పాకాల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-01 09:21:24.0  )
Raj Pakala: చేవెళ్ల ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరైన రాజ్ పాకాల
X

దిశ, వెబ్ డెస్క్ : జన్వాడ ఫామ్‌హౌస్‌(Janwada Farmhouse) కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల(Raj Pakala) చేవెళ్ల ఎక్సైజ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు రాజ్ పాకాల తన న్యాయవాదితో పాటు వచ్చారు. తన ఫామ్ హౌస్ లో పట్టుబడిన అనుమతి లేని విదేశీ మద్యం, ఎన్డీపీ మద్యం విషయమై ఆయనను విచారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గత శనివారం రాత్రి జన్వాడలో ఫామ్‌హౌస్‌లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులతో ఈ మద్యం పార్టీ నిర్వహించారని గుర్తి్ంచారు.

డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం లభించింది. భారీగా ఇండియన్ మేడ్ లిక్కర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక జూదం ఆడేందుకు అవసరమైన ప్లేయింగ్ కార్డ్స్, పోకర్, క్యాసినో వంటి వాటిని గుర్తించారు. ఫాంహౌస్‌లో దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు.. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్‌ పాకాల చేవెళ్ళ ఎక్సైజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

Advertisement

Next Story