'Rythu bandhu' తెలంగాణ కలను సాకారం చేస్తుంది.. MLC Kavita ట్వీట్

by Nagaya |   ( Updated:2023-01-23 06:04:07.0  )
Rythu bandhu తెలంగాణ కలను సాకారం చేస్తుంది.. MLC Kavita ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. బుధవారం రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతలు రైతుబంధు ద్వారా రూ.7,676.61 కోట్ల సహాయం అందుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో వెల్లడించారు. రైతులు, పేదలు సాధికారత పొందే భారతదేశం గురించి కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు. రైతుబంధు పథకం తెలంగాణ కలను సాకారం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, ఈ సీజన్‌లో 70.54 లక్షల మంది రైతులకు చెందిన కోటి 53 లక్షల ఎకరాలకు రూ.7,676.61 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతుబంధు నిధులను బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది.

Advertisement

Next Story