Rain alert: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన

by Maddikunta Saikiran |
Rain alert: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఉదయం 4:30 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్ ,ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్ నగర్, తార్నాక, ముషీరాబాద్, ఓల్డ్ సిటీ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరుతోంది.ఈ క్రమంలో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకి రావొద్దని GHMC అధికారులు సూచించారు.ఇప్పటికే వాతావరణ శాఖ మొత్తం ఏడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.అలాగే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నగరంలో మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed