- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌ను వీడిన నేతలకు రాహుల్ గాంధీ కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాల చేత పార్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ముగిపోయే నావలు అని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నానని, అవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని ప్రకటించారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో పరిస్థితి మారబోతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతేగాక, దేశంలో మొన్న జరిగిన విపక్షాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించాలని అన్ని పార్టీలు కోరాయని, కానీ, తాము విభేదించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. కర్ణాటక ఫలితమే ఇక్కడా రాబోతోందని అన్నారు.
Read More..