- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలిటిక్స్‌లోకి రాహుల్ సిప్లిగంజ్..? పోటీ చేసే స్థానం ఇదే!
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విన్నర్, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు గురువారం తనకు గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇటీవల వరకు రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారనే ప్రచారం జరిగింది.
అయితే అది ఎప్పుడు? ఏ పార్టీలో చేరతారనేది సస్పెన్స్‌గా ఉండగా ఇప్పుడా సస్సెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోషామహల్ నుండి తనకు అవకాశం కల్పించాలని ఆయన పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. బిగ్ బాస్ విజేతగా నిలువకముందు మంగళ్ హాట్ ప్రాంతంలో ఉండేవారు. అనంతరం ఆయన తన నివాసాన్ని మాసాబ్ ట్యాంక్‌కు మార్చినా సెలూన్ మాత్రం నాంపల్లిలో నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాడిన పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన ఒక్కసారిగా సెలబ్రిటీల జాబితాలో చేరిపోయారు.
ఇలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్‌ని గోషామహల్ నుంచి పోటీ చేయిస్తే గట్టి పోటీని ఇవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న గోషామహల్‌లో ఇప్పుడు సరైన అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెతుకుతోంది. అందులో భాగంగానే రాహుల్ సిప్లిగంజ్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది.
- Tags
- rahul sipligunj