- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ సభలో రాహుల్ మానియా!.. కాంగ్రెస్ సెటైర్ (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల యుద్దం సోషల్ మీడియాలో కూడా తదేకంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలోనే బీజేపీ లీడర్లు, క్యాడర్ కూడా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ఓ బీజేపీ మహిళ నేత మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు అని అడుగుతూ.. మీరు దేశాన్ని నరేంద్ర మోడీ చేతుల్లో పెడతారా? లేదా రాహుల్ గాంధీ చేతుల్లో పెడతారా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. దీనిపై కొందరు కార్యకర్తలు రాహుల్ గాంధీ అని అన్నారు. దీంతో ఆశ్చర్యానికి గురైన మహిళ నేత ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ సభలో రాహుల్ మానియా అంటూ ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసింది.
బీజేపీ లీడర్లు, క్యాడర్ కూడా రాహుల్ గాంధే పీఎం కావాలని కోరుకుంటున్నారు
— Aapanna Hastham (@AapannaHastham) May 1, 2024
#RahulGandhiNextPmOfIndia pic.twitter.com/DjnG9vTP2N