తెలంగాణలో రైతు రుణమాఫీపై రాహుల్ గాంధీ స్పందన

by Gantepaka Srikanth |
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాహుల్ గాంధీ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిందని అన్నారు. దీంతో రాష్ట్రంలోని 6.4 లక్షల మంది రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సోదర సోదరీమణులకు మరోసారి రాహుల్ గాంధీ అభినందనలు చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరకు కల్పించేందుకు బీజేపీ నిరాకరించిందని గుర్తుచేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా రాహుల్ ట్వీట్ పెట్టారు. కాగా, తొలి విడతలో రూ.6098 కోట్లు, రెండో విడతలో రూ.6190 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 17 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 12 వేల 224 కోట్లు జమ చేసింది ప్రభుత్వం.

Advertisement

Next Story

Most Viewed