Rahul Gandhi : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

by M.Rajitha |
Rahul Gandhi : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
X

dish, veb desk : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కాసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. బేగంపేట్ లోని విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఘన స్వాగతం పలికారు. నేడు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కులగణన(Caste Census)పై రాహుల్ గాంధీ వివిధ వర్గాల అభిప్రాయం తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాలకు చెందిన వారు దాదాపు 400 మంది దాకా హాజరవనున్నారు. ఇప్పటికే వీరందిరికి సమావేశానికి సంబంధించి ఆహ్వానాలు అందాయి. మరికాసేపట్లో కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం మొదలు కానుంది. కాగా ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

Advertisement

Next Story