Lok Sabha : పార్లమెంట్‌లో రఘునందన్‌రావు తెలుగులో ప్రసంగం..

by Ramesh N |
Lok Sabha : పార్లమెంట్‌లో రఘునందన్‌రావు తెలుగులో ప్రసంగం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్‌లో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలుగులో మాట్లాడారు. జీరో అవర్‌లో మొదట సారి మాట్లాడే అవకాశం కల్పించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు.

అయితే, తెల్లాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట వరకు రైల్వే లైన్ సర్వే పూర్తయ్యి పనులు మాత్రం మొదలు కాలేదని వెల్లడించారు. 44 ఏళ్ల నుంచి కేవలం 9 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అయిందని, దాన్ని కూడా ఆదాయం రావడం లేదని రైళ్ల రాకపోకలు నిలిపివేశారని చెప్పారు. తెలంగాణలో అన్ని జిల్లాలకు రైల్వే స్టేషన్ ఉందని, కానీ ఒకే ఒక జిల్లా హెడ్‌కోటర్స్ అయిన సంగారెడ్డికి మాత్రం రైల్వే స్టేషన్ లేదన్నారు. పటాన్ చెరు అనేది ఆసియాలో పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా, మెదక్ జిల్లా ఇండస్ట్రీలకు ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు సర్వే కూడా పూర్తయిన 225 కిలోమీటర్ల రైల్వే లైన్ వెంటనే నిర్మాణం చెయ్యాలని పార్లమెంట్‌లో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed