క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా.. కొత్త అధ్యక్షుడి ప్రచారంపై రఘునందన్ హాట్ కామెంట్స్

by Ramesh N |
క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా.. కొత్త అధ్యక్షుడి ప్రచారంపై రఘునందన్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం పై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల తప్పకుండా పాటిస్తాని స్పష్టంచేశారు. తను క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. పార్టీ కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ కార్యకర్త అని వెల్లడించారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదని, ఈ క్రమంలోనే అస్సాంలో హిమంత బిశ్వ శర్మకు సీఎం పదవి వచ్చిందని గుర్తచేశారు.

కొత్త, పాత అనేది ఏమి లేదు.. పార్టీలో చేరినప్పటి నుంచి సామార్థ్యాన్ని, స్థాయిని బట్టి అధిష్టానం పదవులు ఇస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు.. రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారని అన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఈడి రాక తప్పదన్నారు. అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని, గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అంతా కేసీఅర్ పేరే చెబుతున్నారన్నారు.

Advertisement

Next Story