Raghunandan Rao : సెక్యులరిజం అంటే ఇదేనా.. CM రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్

by Sathputhe Rajesh |
Raghunandan Rao : సెక్యులరిజం అంటే ఇదేనా.. CM రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మైనార్టీల పండుగలకు రూ.33 కోట్లు కేటాయించారని.. మరి తెలంగాణలో హిందువులు , హిందూ పండుగలు లేవా అని ప్రశ్నించారు. ఇదేనా సెక్యులరిజం అంటే అని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర బడ్జెట్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళను నిధులు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. మరి డీపీఆర్‌ను కేంద్రానికి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఫసల్ భీమా యోజనలో చేరతామని భట్టి చెప్పారని మరి ఈ స్కీమ్ కేంద్రానికి కాదా అని క్వశ్చన్ చేశారు.

కేసీఆర్ సీఎంగా ఉంటే గజ్వేల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వస్తుందని.. రేవంత్ రెడ్డి సీఎం అయితే కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పడిందన్నారు. మరి రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాలు మీకు కనిపించలేదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తోలు గుడ్డు పెట్టిన కేటీఆర్, గాడిద గుడ్డు అంటున్నారని సెటైర్లు వేశారు. 33 జిల్లా పేర్లను బడ్జెట్‌లో చదవని మీరు కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ పెట్టినట్లు మిగతా పట్టణాలకు పెట్టని మీరు మాట్లాడే హక్కు లేదన్నారు. మీరంతా ‘నై తెలంగాణ బ్యాచ్’ అని.. మేమంతా ‘జై తెలంగాణ బ్యాచ్’ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పీఎం మోడీ కట్టుబడి ఉన్నారన్నారు.

Advertisement

Next Story