లక్షల కోట్లు ఏమయ్యాయి..? CM కేసీఆర్‌పై రఘునందన్ రావ్ ఫైర్

by Satheesh |
లక్షల కోట్లు ఏమయ్యాయి..? CM కేసీఆర్‌పై రఘునందన్ రావ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత 4 సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చేయడం లేదని, మధ్యాహ్న భోజన పథకం కింద కనీసం నాణ్యమైన భోజనం కూడా అందించలేకపోతోందని ఆరోపించారు.

ఫీజు రియంబర్స్ మెంట్‌పై ఆశలు పెట్టుకుని ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వ వైఖరి తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోందని అన్నారు. సకాలంలో నిధులు చెల్లించలేనప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ అప్పు ఎవరికోసం అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకు విడుదల చేస్తున్న నిధులకు పొంతన ఉండటం లేదని ఆరోపిచారు.

Advertisement

Next Story