Raghunandan Rao: కేటీఆర్ ఫామ్ హౌస్ ఇష్యు.. వారిపై దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు: రఘునందన్

by Prasad Jukanti |
Raghunandan Rao: కేటీఆర్ ఫామ్ హౌస్ ఇష్యు.. వారిపై దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు: రఘునందన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగురవేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గతంలో కేసులు పెట్టి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారని నిలదీశారు. ఫామ్ హౌస్ నాది కాదు అని ఆనాడే మంత్రి హోదాలో చెప్పకుండా ఇప్పుడు దాన్ని ఇతరుల పేరు మీదకు బదిలీ చేసి ఫామ్ హౌస్ నాది కాదంటే ఎలా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులు, శిఖం, బఫర్ జోన్ లో ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే వారి పట్ల దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ నిర్మాణాలను 24 గంటల్లో కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed