ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు

by Satheesh |   ( Updated:2024-07-16 11:15:15.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడి రాధాకిషన్ రావు‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత సమాచారం రాబట్టాలని.. ఇందు కోసం నిందితుడు రాధాకిషన్ రావును కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. పోలీసుల విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం.. రాధాకిషన్ రావును రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కొంత కాలంగా సైలెంట్‌గా సాగుతోన్న ఈ కేసులో ఒక్కసారిగా రాధాకిషన్ రావును పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాధాకిషన్ రావు నుండి పోలీసులు ఎలాంటి వివరాలు రాబడతారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story