Police : మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం కావొచ్చు.. గుర్తుంచుకోండి!

by Ramesh N |
Police : మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం కావొచ్చు.. గుర్తుంచుకోండి!
X

దిశ,డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలు కళ్ల ముందే జరిగినప్పుడు నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం కొంత మంది చేస్తుంటారు. వారి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలవుతాయి. అయితే ప్రమాదం గురించి తెలియజేసే విషయంలో పోలీసులతో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమోనని భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలోనే ఎక్స్‌‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఆసక్తికర అవగాహన వీడియో విడుదల షేర్ చేశారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం కావొచ్చు, అదే మీ సత్వర స్పందన ఓ కుటుంబ భవిష్యత్తును నిలబెడుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరం స్పందించాలన్నారు. 108 లేదా DIAL-100 కు కాల్ చేసి, బాధితుల ప్రాణాలను కాపాడండి, మీ మానవత్వాన్ని చాటుకోండి. గుర్తుంచుకోండి ! సమాచారం అందిస్తే, పోలీసు వారు మీకు సహకరిస్తారు అంతేగాని ఇబ్బంది పెట్టరు.. అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story