ట్రాఫిక్​ కానిస్టేబుల్‌ను అభినందించిన రాచకొండ సీపీ

by Vinod kumar |   ( Updated:2023-05-15 14:48:48.0  )
ట్రాఫిక్​ కానిస్టేబుల్‌ను అభినందించిన రాచకొండ సీపీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలను చాకచక్యంగా కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్ ​సతీష్​ను సోమవారం రాచకొండ కమిషనర్​ డీ.ఎస్.చౌహాన్ తన క్యాంప్​ కార్యాలయంలో​అభినందించారు. ఈనెల 13న ఎల్బీనగర్​ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న సతీష్​ విజయవాడ బస్టాపులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయంత్రం 6గంటల సమయంలో బతుకుదెరువు కోసం జార్ఞండ్​ నుంచి ఇక్కడికి వచ్చి పనిదొరకక సమస్యలతో సతమతమవుతున్న మాంగ్ర (35) ఎల్బీనగర్​ఫ్లై ఓవర్​బ్రిడ్జీ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించాడు.

ఇది గమనించిన సతీష్​పరుగున అతని వద్దకు వెళ్లాడు. మాంగ్రతో మాట్లాడుతూ.. సమస్యలు ఏవైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానంటూ మాటల్లో పెట్టాడు. మెల్లిగా మాంగ్ర వద్దకు చేరుకుని అతను మెడలో వేసుకున్న టవల్​ను పట్టుకుని గట్టిగా లాగి బ్రిడ్జీపైకి చేర్చాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలోనే కమిషనర్​చౌహాన్ ​సోమవారం సతీష్​ను అభినందించి రివార్డుతోపాటు బహుమతిని అందించారు.


Advertisement

Next Story