బీసీలకు సర్కార్ లక్ష ఆర్థిక సాయం.. ఆర్.కృష్ణయ్య రియాక్షన్ ఇదే!

by GSrikanth |
బీసీలకు సర్కార్ లక్ష ఆర్థిక సాయం.. ఆర్.కృష్ణయ్య రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్థికంగా చితికిపోయిన బీసీ కులాలకు చేయుతనిచ్చేందుకు ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎన్నికల స్టంట్ అని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ తన హామీలతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇదే తరహా రుణాలు ఇస్తామని 5 లక్షల కంటే ఎక్కువ మంది వద్ద దరఖాస్తులు తీసుకుని వాటిని పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు.

తాము బీసీ బంధు కోసం పోరాటం చేస్తుంటే దానిని అమలు చేయకుండా లక్ష ఆర్థిక సాయం చేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలు మానుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించడంతో పాటు దేశంలో ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మే 21న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story