అనుమానంతో పేదల ప్రాణం తీస్తారా.. ఖదీర్ ఖాన్ మృతిపై RSP ఆగ్రహం

by GSrikanth |
అనుమానంతో పేదల ప్రాణం తీస్తారా.. ఖదీర్ ఖాన్ మృతిపై RSP ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసుల చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిన ఖదీర్ ఖాన్ మృతిపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖదీర్ ఖాన్ మృతికి కారకులైన పోలీసు సిబ్బందిపై ఐపీసీ 302 కింద మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనుమానం పేరుతో పోలీసులు పేదలపై బలప్రయోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం గొలుసు చోరీ అనుమానంతోనే గతంలో మరియమ్మ అనే మహిళను, ఇప్పుడు ఖదీర్ ఖాన్ లాంటి పేద బహుజనుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

వేల కోట్ల స్కాములు చేస్తున్న అదానీ, కవిత, విజయ్ మల్యా లాంటి వారిని ఎప్పుడైనా కనీసం ముట్టుకునే ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. పోలీసులకు పేదల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయాయని ధ్వజమెత్తారు. కాగా, చైన్ స్నాచింగ్ కేసులో మహమ్మద్ ఖదీర్ ఖాన్ (35) అనే వ్యక్తిని మెదక్ పోలీసులు గత నెల 29న అరెస్టు చేశారు. మెదక్ తీసుకువచ్చి ఠాణాలో లాఠీలతో కొట్టడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దెబ్బలకు ఆసుపత్రిలో చేరిన బాధితుడు చికిత్స పొందుతూ గత గురువారం ప్రాణాలు వదిలాడు. తన భర్త మృతికి పోలీసులే కారణం అని ఖదీర్ భార్య ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed