- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కుక్కలకన్న హీనమా నిరుపేద బతుకులు?: ఆర్ఎస్పీ
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసుల చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయిన ఖదీర్ ఖాన్ మృతిపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన ఇంట్లో కుక్క పిల్లకు ఇచ్చే విలువను నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ఖదీర్ శాన్ మృతిపై ఆర్ఎస్పీ స్పందించారు. తన ఇంట్లో హస్కీ అనే కుక్కపిల్ల చనిపోతే.. డాక్టర్‌పై కేసు పెట్టారని గుర్తు చేశారు. కానీ, మెదక్‌లో బహుజన బిడ్డ ఖదీర్ ఖాన్‌ను కిడ్నీలు చెడిపోయేలా కొట్టిచంపితే వాళ్లను ఇంకా వెనకేసుకొస్తున్నరని, దీనిపై కేసీఆర్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
మీ కుక్కపిల్లల కన్నా నిరుపేద బతుకులు అంత హీనమా అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఖదీర్ ఖాన్ మృతికి కారకులైన పోలీసు సిబ్బందిపై ఐపీసీ 302 కింద మర్డర్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమానం పేరుతో పోలీసులు పేదలపై బలప్రయోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం గొలుసు చోరీ అనుమానంతోనే గతంలో మరియమ్మ అనే మహిళను, ఇప్పుడు ఖదీర్ ఖాన్ లాంటి పేద బహుజనుల ప్రాణాలు తీస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
#KCR గారూ,మీఇంట్లో కుక్క పిల్ల-హస్కీ చచ్చిపోతెనేమో డాక్టర్ల మీద కేసు పెట్టిండ్రు, కానీ ఒక పేద బహుజనబిడ్డ ఖదీర్ ఖాన్‌ను మీ పోలీసులు మెదక్ లో కిడ్నీలు చెడిపోయేలా కొట్టిచంపితే వాళ్లను ఇంకా వెనకేసుకొస్తున్నరు. మీ కుక్కలకన్న హీనమా తెలంగాణల మా నిరుపేద బతుకులు??#Justice4KhadirKhan pic.twitter.com/HhYiu4Xxmb
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 19, 2023