- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖదీర్ ఖాన్‌ది ముమ్మాటికీ లాక్ అప్ డెత్: వినోద్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్ ఖాన్ పోలీసుల అత్యుత్సాహం వలనే మరణించాడని టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ లాక్ అప్ డెత్ అని స్పష్టం చేశారు. కానీ కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. లాక్ అప్ డెత్‌పై హోంమంత్రి ఇప్పటి వరకు నోరు విప్పడం లేదని ఫైర్అయ్యారు.
కనీసం ప్రభుత్వం విచారణ కమిటీని కూడా నియమించలేకపోయిందన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. మైనారిటీలకు తానే రక్షణ అని చెప్పుకు తిరిగే అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖదీర్ ఖాన్ మృతిపై మాట్లాడకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. కచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ జరపాలన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్‌చేయాలని ఆయన డిమాండ్ చేశారు.