ఈనెల 13న పబ్లిక్ హాలీడే.. హైకోర్టు ఉత్తర్వులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-09 07:13:03.0  )
ఈనెల 13న పబ్లిక్ హాలీడే.. హైకోర్టు ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పర్వదినం ఈ సారి ఆదివారం వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి పండగ ఆదివారం వస్తున్న దృష్ట్యా సెలవు కొనసాగింపుగా ఈ నెల 13న సోమవారం పబ్లిక్ హాలీడేగా హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు, జిల్లా జ్యూడీషరీలు, ట్రిబ్యునల్‌లు, లేబర్ కోర్టులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పండగ సెలవును 12 నుంచి 13కు మార్చగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం దీపావళి సెలవును సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story