బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దు.. జిల్లా SP హెచ్చరిక

by Gantepaka Srikanth |
బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దు.. జిల్లా SP హెచ్చరిక
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో డిసెంబర్ 2వ తేదీ నుంచి వచ్చే జనవరి 1వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా సబ్ డివిజన్ అధికారుల(డీఎస్పీ)నుంచి అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ధర్నాలు నిషేధమని ఆమె హెచ్చరించారు. అలాగే పేలుడు పదార్థాలు, కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కర్రలు, రాళ్ళను జమ చేయడం, ధరించి తిరుగుట నిషేధమన్నారు. జన సమూహం, లౌడ్ స్పీకర్స్, డీజేలు వంటివి కూడా ఈ సమయంలో నిషేధిస్తున్నామని, ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed